News April 18, 2024
CM జగన్ హత్యకు కుట్ర.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు

ఏపీ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ హత్యకు కుట్ర పన్నారని, చంపాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీశ్ పదునైన రాయితో దాడి చేశాడని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు సీఎంకు పెద్ద గాయం కాలేదని తెలిపారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీ ఆధారాలతో ఈ నెల 17న నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు.
Similar News
News August 31, 2025
ఫ్రీ బస్సు.. మరో శుభవార్త

AP: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా అనుమతించాలని ప్రభుత్వం RTCని ఆదేశించింది. కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో నడిచే బస్సులకు ఆయా బస్టాండ్లలోనే టికెట్లు ఇస్తుంటారు. ఇలాంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల్లో ఇకపై మహిళలు ఉచితంగా వెళ్లవచ్చు. అలాగే సింహాచలం కొండతో సహా 39 ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ ఈ స్కీం అమలుకు ఆదేశాలిచ్చారు.
News August 31, 2025
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: హైకోర్టు

TG: 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్టప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు.
News August 31, 2025
మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా?

జీమెయిల్ అకౌంట్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. హ్యాకింగ్ అటాక్స్ నేపథ్యంలో వెంటనే పాస్వర్డ్స్ ఛేంజ్ చేసుకోవాలంది. థర్డ్ పార్టీ సేల్స్ఫోర్స్ సిస్టమ్ డేటాను తస్కరించడంతో 250కోట్ల మంది అకౌంట్స్ ప్రమాదంలో పడ్డాయని ఇటీవల గూగుల్ వెల్లడించింది. అయితే కస్టమర్ డేటాకు ప్రమాదం లేదని, కంపెనీ సేల్స్ఫోర్స్ సిస్టమ్కు ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.