News April 20, 2024

కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర: ఆతిశీ

image

బీజేపీ ఆదేశానుసారం తిహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర జరుగుతోందని మంత్రి, ఆప్ నేత ఆతిశీ ఆరోపించారు. జైలు అధికారుల <<13092251>>నివేదిక<<>> చూస్తే బీజేపీ చేస్తున్న కుట్ర అర్థమవుతోందన్నారు. ‘రక్తంలో షుగర్ లెవల్ 300 ఉంటే ప్రమాదకరమని ఏ డాక్టర్ అయినా చెబుతారు. ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడంలో జైలు అధికారులకు ఇబ్బంది ఏంటి? ఆయన జైలుకెళ్లే ముందు ప్రతిరోజూ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకునేవారు’ అని ఆతిశీ తెలిపారు.

Similar News

News March 23, 2026

కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సార్.. విద్యార్థి లేఖ వైరల్

image

‘నేను చదివినవి పరీక్షలో రాలేదు. పాస్ చేయండి సార్’ అంటూ ఓ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్లో రాసిన లేఖ వైరలవుతోంది. ‘నాకు అమ్మానాన్న లేరు. నా దేవుడు మీరే సర్. నన్ను పాస్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. టీచర్ కాళ్లు పట్టుకున్నట్లుగా బొమ్మ కూడా గీశారు. TGలోని అచ్చంపేట పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ క్రియేటివిటీ చూసైనా మార్కులు వేయాలని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

News March 23, 2026

మీ పిల్లలకు తప్పక నేర్పించండి!

image

పిల్లలకు ముఖ్యంగా 12ఏళ్ల లోపు <<19447164>>చిన్నారులకు<<>> తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలు నేర్పించాలి. వీలైనంత వరకు జీబ్రా లైన్స్ వద్ద రోడ్డు దాటాలని.. ఎడమ, కుడి 2 వైపులా చూడాలని చెప్పాలి. వాహనాల వేగాన్ని గమనిస్తూ ఇప్పుడు రోడ్డు దాటడం సేఫేనా, ఆగుదామా? అని ఆలోచించాలని వివరించాలి. ఉన్నట్టుండి రహదారిపై పరిగెత్తడం, దూకడం చేయకూడదని నేర్పాలి. రోడ్డు దాటే టైమ్‌లో ఫోన్ వాడటం/హెడ్‌ఫోన్లు పెట్టుకోవద్దని హెచ్చరించాలి.

News March 23, 2026

నేడు షాహీద్ దివస్.. అమరవీరులకు జోహార్లు!

image

దేశ స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. లాలాలజపతి రాయ్ మరణించడం భగత్ సింగ్ పోరాటానికి ఆజ్యం పోసింది. తన స్నేహితులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి లాల మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్‌ను చంపే క్రమంలో పొరపాటున జాన్ సౌండర్స్ అనే మరో ఆఫీసర్‌ను హతమార్చుతారు. ఈ కేసుపైనే బ్రిటిషర్లు వీరిని అరెస్ట్ చేసి 1931 MAR 23న ఉరి తీశారు. వీరి పోరాటానికి నివాళిగా ఏటా ఈరోజును షాహీద్ దివస్‌గా జరుపుకుంటాం.