News July 12, 2024
బర్త్‌డే రోజే నా హత్యకు కుట్ర: రఘురామ

AP: వైసీపీ పాలనను విమర్శించాననే కక్షతో 2021లో తన హత్యకు కుట్ర పన్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన పుట్టినరోజు నాడే అంతమొందించేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై హత్యాయత్నం చేసిన వారందరికీ శిక్ష పడాలని ఆయన కోరారు. కూటమి అధికారంలోకి రాకపోయుంటే తనను ఇప్పటికే చంపేసేవారని చెప్పారు.
Similar News
News October 13, 2025
చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను: మంత్రి పొంగులేటి

TG: మంత్రి కొండా సురేఖతో <<17994511>>విభేదాలంటూ<<>> జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ‘చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను. నాపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదు. ఈరోజు పర్యటనకు ఆమె రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేవీ లేవు. అందరూ అన్ని సార్లు ఉండాలనేం లేదు. వచ్చే పర్యటనలో అక్కలు అందరూ ఉంటారు’ అని మేడారం పర్యటనలో వ్యాఖ్యానించారు.
News October 13, 2025
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్

TG: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తేవాలి. భోజనం క్వాలిటీ చెక్ చేసేందుకు టెక్నాలజీ వాడాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలి. హాస్టళ్లను మెడికల్ కాలేజీలు, CHCతో లింక్ చేయాలి’ అని సూచించారు.
News October 13, 2025
పాక్‌లో ఆగని అల్లర్లు

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా TLP చేపట్టిన ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతూనే ఉంది. లాహోర్‌లో పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో మరణించగా నేడు కూడా ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్లపై అడ్డంగా పెట్టిన షిప్పింగ్ కంటైనర్లను తొలగించబోయారు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై వారు కాల్పులు జరిపినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. తాజా ఘర్షణల్లో పోలీసు అధికారితో సహ ఐదుగురు మరణించారు.