News October 15, 2024
పన్నూన్ హత్యకు కుట్ర: US వెళ్లిన భారత ఇన్వెస్టిగేషన్ టీమ్

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 2, 2026
BIG NEWS: మోదీతో ట్రంప్ చర్చలు

కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య సందిగ్ధంలో ఉన్న ట్రేడ్ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. PM మోదీతో US అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినట్లు భారత్‌లోని US రాయబారి సెర్జియో గోర్ Xలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూడండని రాసుకొచ్చారు. దీంతో సుంకాలు, H1B వీసాలపై కీలక ప్రకటన వెలువడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియా గేట్ ఫొటోతో ట్రంప్ హింట్ <<19033803>>ఇచ్చారంటున్నారు.<<>>
News February 2, 2026
లేట్ నైట్ నిద్రపోతున్నారా? బీ కేర్‌ఫుల్..

‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజా స్టడీ ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు చాలా ఎక్కువగా ఉంది. బాడీ క్లాక్ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. వీరికి గుండె జబ్బుల రిస్క్ ఇతరుల కంటే 16% ఎక్కువగా ఉంటోంది. సరైన నిద్ర, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ అలవాటు కారణంగా ఈ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
News February 2, 2026
ఇండియా గేట్ ఫొటో షేర్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లక్ష్యంగా ఆసక్తికర పోస్టు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది అందమైన విజయోత్సవ తోరణం. USలో ఇంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తాం’ అని రాసుకొచ్చారు. అలాగే న్యూస్ మేకర్స్ ఆఫ్-2025 పేరుతో ‘ఇండియా టుడే’ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పేజీ పోస్టర్‌నూ షేర్ చేశారు. INDతో ట్రేడ్ డీల్ సానుకూలంగా జరుగుతోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు.


