News May 5, 2024

రాజాసింగ్‌ హత్యకు కుట్ర.. ఉగ్రవాది అరెస్టు

image

బీజేపీ MLA రాజాసింగ్, నుపుర్ శర్మ హత్యకు కుట్ర పన్నిన ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మౌలానా సొహైల్ అబు బకర్‌గా గుర్తించారు. దారాల పరిశ్రమలో మేనేజర్‌గా చేస్తూ పిల్లలకు ఇస్లాంపై ట్యూషన్లు నిర్వహిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు సాగించేందుకు నిందితుడికి పాక్‌ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Similar News

News March 23, 2026

కేంద్రం షాక్.. RRRకు ఎక్స్‌ప్రెస్ వే హోదా రద్దు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఎక్స్‌ప్రెస్ వే హోదాను రద్దు చేసి సాధారణ జాతీయ రహదారి స్టేటస్ కల్పించింది. ప్రాజెక్ట్ వ్యయం ₹38వేల కోట్లకుపైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో RRR స్పీడ్ లిమిట్ 120-130KMPH నుంచి 100కు తగ్గనుంది. అలాగే 8 లేన్ రోడ్డును రాష్ట్రం ప్రతిపాదించగా కేంద్రం దానిని ఇప్పుడు ఆరుకు కుదించింది.

రూర్బన్ పంచాయతీలు.. ఏప్రిల్ 24న ప్రారంభం!

image

AP: రాష్ట్రంలో పంచాయతీల పునర్విభజన తర్వాత 359 గ్రామాలు <<19342076>>రూర్బన్<<>> కేటగిరీలోకి చేరాయి. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న ప్రభుత్వం వీటిని ప్రారంభించనుంది. అక్కడ పట్టణ తరహా సదుపాయాలు, పౌర సేవలు అందించనుంది. డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ పంచాయతీ కార్యదర్శులు గెజిటెడ్ హోదాలో విధులు నిర్వర్తించనున్నారు. ఇక గ్రేడ్-1లో 3,082, గ్రేడ్-2లో 3,163, గ్రేడ్-3లో 6,747 పంచాయతీలు ఉన్నాయి.