News April 11, 2024
గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఓ బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీకి హాజరై ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News December 20, 2025
5 జిల్లాల పరిథిలో అమరావతి ORR

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. భూసేకరణకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవే శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. 189 KM మేర 6 లేన్లుగా ఈ నిర్మాణం జరగనుంది. దీని పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు రానున్నాయి. 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. మొత్తం 5789 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు విధించారు.
News December 20, 2025
ఈ నెల 28 నుంచి అసెంబ్లీ?

TG: ఈ నెల 28 నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ట్ పాలసీ, ఇరిగేషన్, GHMC విలీన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సర్కారు పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో BCలకు పార్టీపరంగా 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 20, 2025
అంతరిక్షం నుంచి సేఫ్‌గా కిందకు.. ఇస్రో పారాచూట్ టెస్ట్ సక్సెస్!

గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన ‘డ్రోగ్ పారాచూట్’ టెస్టులను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చండీగఢ్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో ఈ ప్రయోగాలు జరిగాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చే క్రమంలో క్రూ మాడ్యూల్ స్పీడ్ తగ్గించి, స్థిరంగా ఉంచడంలో ఈ పారాచూట్లు హెల్ప్ చేస్తాయి. ప్రయోగ పరీక్షల్లో భారీ గాలి ఒత్తిడిని ఇవి సమర్థంగా తట్టుకున్నాయి. మానవ సహిత రోదసీ యాత్ర దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు.


