News December 2, 2024
కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్!

TG: రంగారెడ్డి(D) ఇబ్రహీంపట్నంలో జరిగిన <<14767158>>కానిస్టేబుల్ నాగమణి హత్య<<>>కు ఆస్తి గొడవలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి పేరెంట్స్ లేరు. ఇప్పటికే ఒకసారి వివాహమై విడాకులు అయ్యాయి. వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి పెళ్లి తర్వాత ఆమె తన తమ్ముడు పరమేశ్‌కు ఇచ్చేసింది. రెండో పెళ్లి తర్వాత భూమిలో వాటా ఇవ్వాలని పరమేశ్‌ను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆ కోపంతోనే పరమేశ్ ఆమెను చంపినట్లు తెలుస్తోంది.
Similar News
News October 15, 2025
వ్యాపార నిర్వహణలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్!

ఫార్చ్యూన్-2025 ప్రకారం వ్యాపార నిర్వహణలో NVIDIA వ్యవస్థాపకుడు జెన్సెన్ హువాంగ్(US) వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్‌గా నిలిచారు. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా CEO ఎలాన్ మస్క్ టాప్-4లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వాంగ్ చువాన్ఫు, సుందర్ పిచాయ్(గూగుల్), రెన్ జెంగ్ఫీ, సామ్ ఆల్ట్మాన్, జామీ డిమోన్, మేరీ బార్రా ఉన్నారు. టాప్-20లో ఇండియన్స్ ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
News October 15, 2025
గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారికి గుడ్‌న్యూస్

తెలంగాణలో గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 18న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో 782 మందికి ఆయన అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తారు. ఇందుకుగానూ టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28న టీజీపీఎస్సీ గ్రూప్-2 తుది ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
News October 15, 2025
APPLY NOW: చిత్తూరులో 56 పోస్టులు

AP: చిత్తూరులోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(DHMO) 56 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఎంబీబీఎస్, GNM, నర్సింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://chittoor.ap.gov.in/