News January 6, 2025

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

image

AP: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న.. అనంతపురంలో 8-10వరకు జరగాల్సిన పరీక్షలను 17-20, చిత్తూరులో 8, 9న జరగాల్సిన ఎగ్జామ్స్‌ను 17, 18 తేదీలకు మార్చినట్లు పేర్కొంది.

Similar News

News November 25, 2025

ఆలయ అకౌంట్ నుంచి డబ్బు వెనక్కి రప్పించాలి: CCIకి అధికారుల విజ్ఞప్తి

image

<<18381330>>రాజన్న ఆలయ ట్రస్టు ఖాతాలో<<>> జమ అయిన ఏదుల సత్తమ్మకు చెందిన రూ.2,14,549లను వెనక్కి తెప్పించి రైతుకు అందజేయాలని సీసీఐ అధికారులకు వేములవాడ మార్కెట్ కమిటీ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. సత్తమ్మ ఆధార్ కార్డుకు రాజన్న ఆలయ బ్యాంకు అకౌంటు లింక్ అయి ఉండడంతో ఆమె పత్తి విక్రయించిన సొమ్ము ఆలయ ఖాతాలో జమ అయింది. కాగా, ప్రైవేటు వ్యక్తి ఆధార్ నంబర్‌తో రాజన్న ఆలయ అకౌంటు లింక్ అయి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

News November 25, 2025

మహిళలకు మెగ్నీషియం ఎంతో ముఖ్యం

image

శరీరానికి ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 300 మి.గ్రా మెగ్నీషియం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు, ఎముకల ఆరోగ్యం, ఋతుస్రావం, ప్రెగ్నెన్సీ వంటి అన్ని దశల్లో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజలు, బచ్చలికూర, బాదం, జీడిపప్పు, పాలు, డార్క్ చాక్లెట్, చిక్కుడు, అవకాడో, పప్పు దినుసులు, అరటిపండు, సోయాపాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

News November 25, 2025

రేపే ఎన్నికల షెడ్యూల్!

image

TG: గ్రామాల్లో ఎన్నికల నగరా మోగనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా అందడంతో రేపు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు SEC సిద్ధమైనట్లు సమాచారం. బుధవారం కుదరకపోతే ఎల్లుండి తప్పనిసరిగా షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. షెడ్యూల్, నోటిఫికేషన్, ఎన్నికల తేదీలపై ఇవాళ క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం వీటిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.