News November 1, 2024
డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు

AP: ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. మొత్తం 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు. కానీ రెండో దశ కోసం 91,507 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 24, 2025
నల్ల వెల్లుల్లి గురించి తెలుసా.. బోలెడు ప్రయోజనాలు

వెల్లుల్లి అంటే తెల్లటి రెబ్బలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నల్ల వెల్లుల్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తెల్ల వెల్లుల్లిని ఫర్మంటేషన్ ప్రక్రియ ద్వారా నల్లగా తయారు చేస్తారు. ఇది ఘాటు వాసన లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది. నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు ఒకటి రెండు రెబ్బలు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News December 24, 2025
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల(గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా యానిమల్(రూ.917 కోట్లు)ను బీట్ చేసి 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేకవడం గ్యారంటీ.
News December 24, 2025
కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.


