News November 12, 2024

పిల్లల్లో మలబద్ధకం ఉందా?

image

నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, ఫిజికల్ యాక్టివిటీలు తక్కువవడం, పీచు పదార్థాలు తక్కువ తినడం పిల్లల్లో మలబద్ధకానికి కారణాలని వైద్యులు అంటున్నారు. నీటి శాతం పెంచడం, ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో అందిస్తే పిల్లల్లో మలబద్ధకం లేకుండా చేయవచ్చంటున్నారు. పండ్లు తినిపించడంతో పాటు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం మంచిదని చెబుతున్నారు.

Similar News

News December 13, 2025

HYD: మెస్సీ మ్యాచ్..NOT ALLOWED

image

ఉప్పల్‌లో నేడు జరగనున్న “మెస్సీ” గోట్ ఇండియా టూర్ లైవ్ ఈవెంట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కఠిన భద్రతా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా కెమెరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, సిగరెట్లు, లైటర్లు, ఆయుధాలు, నీటి సీసాలు, మద్యం, ఆహారం, బ్యాగులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్లు, బైనాక్యులర్లు, పటాకులు, మత్తు పదార్థాల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు.

News December 13, 2025

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

image

<<18552173>>కోల్‌కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్‌కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.

News December 13, 2025

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.