News June 22, 2024

వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాలు, రిజర్వేషన్లు పెరుగుతాయి: కిషన్ రెడ్డి

image

TG: వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘నియోజకవర్గాలు మారుతాయి. SC, ST, మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు అవకాశాలు ఉంటాయి. వచ్చే సారి పార్లమెంటు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత BRS ప్రభుత్వంలాగే కాంగ్రెస్ సర్కారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అని తెలిపారు.

Similar News

News October 9, 2024

ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నారాయణపేట, గద్వాల, కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 9, 2024

వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి

image

TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

News October 9, 2024

నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు

image

తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.