News March 17, 2024

మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలోని ఓటర్లు

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16,80,417 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ మహబూబ్‌నగర్ అసెంబ్లీలో – 2,58,658
✓ జడ్చర్ల అసెంబ్లీలో- 2,23,222
✓ దేవరకద్ర అసెంబ్లీలో – 2,39,077
✓ నారాయణపేట అసెంబ్లీ – 2,35,517
✓ మక్తల్ అసెంబ్లీ – 2,43,338
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,42,267
✓ షాద్‌నగర్ అసెంబ్లీలో – 2,38,338 మంది ఉన్నారు

Similar News

News January 3, 2026

మహబూబ్‌నగర్: నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

image

విజయవాడలో ఈనెల 15 నుంచి 18 వరకు జరిగే జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన పాండు నాయక్, హేమంత్ యాదవ్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన సెలక్షన్స్‌లో వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

News January 3, 2026

MBNR: సంక్రాంతి పండుగ.. ప్రత్యేక బందోబస్తు: SP

image

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లావాసులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సందర్భాలలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు, నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News January 3, 2026

అభివృద్ధిలో MBNR జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

image

జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పాలమూరును అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్ సహా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పరస్పర సహకారంతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.