News November 26, 2024
మోదీ స్ఫూర్తితో రాజ్యాంగ దినోత్సవం: స్పీకర్ ఓంబిర్లా
ప్రజల కొన్నేళ్ల తపస్సు, త్యాగం, చాతుర్యం, బలం, సామర్థ్యాల ఫలితమే రాజ్యాంగమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. భౌగోళిక, సామాజిక వైవిధ్యాలను ఒకే దారంలో కూర్చేందుకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో మూడేళ్లు శ్రమించామని తెలిపారు. PM మోదీ స్ఫూర్తితో 2015 నుంచి NOV 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నేడు కోట్లాది మంది కృతజ్ఞతా పూర్వకంగా రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేస్తున్నారని వెల్లడించారు.
Similar News
News November 26, 2024
జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం: పవన్
AP: వైసీపీ ప్రభుత్వ తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు. జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేదని, సమోసాల కోసమే రూ.9కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.
News November 26, 2024
BREAKING: రేపు తుఫాన్
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు APSDMA వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరానికి చేరనుందని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో 29వ తేదీ వరకు అక్కడక్కడా భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 26, 2024
చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్.. కారణమిదే
అతని నెల జీతం రూ.1.20 లక్షలు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. దీంతో పెద్దలు ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. తీరా పెళ్లి పీటల మీద కూర్చున్నాక యువతి మనసు మార్చుకుంది. తాను GOVT ఉద్యోగిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పింది. చేసేదేమీ లేక ఇరు పక్షాలు మ్యారేజ్‌ను రద్దు చేసుకున్నాయి. యూపీ ఫరూఖాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతోంది.