News April 24, 2024

మాపై బలవంతంగా భారత రాజ్యాంగాన్ని రుద్దుతున్నారు: కాంగ్రెస్ నేత

image

కాంగ్రెస్ సౌత్ గోవా MP అభ్యర్థి కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘1961లో పోర్చుగీస్ నుంచి స్వతంత్రం రాగానే GOA ప్రజలపై బలవంతంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసి డ్యుయల్ సిటిజన్‌షిప్‌ను చిక్కుల్లో పెట్టారు. ఈ విషయాన్ని రాహుల్‌తో చెప్తే రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లను పరిగణించమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక గోవాకు ఫ్రీడం వచ్చినందున ఇది మాకు వర్తించదన్నాను’ అని తెలిపారు.

Similar News

News March 30, 2026

పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇరాన్

image

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి పాకులాడుతున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ దేశ నేతల ప్రకటనలను ఇరాన్ ఖండించింది. పాక్ వేదికలపై చర్చల్లో తాము పాల్గొనలేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ Xలో స్పష్టం చేసింది. ‘అమెరికాతో ప్రత్యక్ష చర్చల్లేవు. వారు మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు చేస్తున్నారు. US దౌత్య విధానాలు నిత్యం మారుతున్నాయి’ అని పేర్కొంది.

News March 30, 2026

OTTలోకి రాధిక ‘తాయ్ కిళవి’

image

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ నటించిన <<19338573>>‘తాయ్ కిళవి’<<>> ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మూవీలో 70 ఏళ్ల వడ్డీ వ్యాపారి పాత్రలో రాధిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాదాపు రూ.75 కోట్ల కలెక్షన్లతో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

News March 30, 2026

టీవీకే చీఫ్ విజయ్‌కి రూ.520 కోట్ల ఆస్తులు!

image

TVK చీఫ్ విజయ్ తనకు ₹520Cr+ (₹405Cr చరాస్తులు, ₹115Cr స్థిరాస్తులు) ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. భార్య సంగీత పేరిట ₹15Cr+ చరాస్తులు, ₹2.5Cr స్థిరాస్తులు, ₹85Cr బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. విజయ్ వద్ద 800gm+ బంగారం, సంగీత వద్ద 3kg+ గోల్డ్, ₹కోటి విలువైన డైమండ్స్, 2kgs వెండి ఉంది. ₹2L నగదు, BMW 530Li, BMW i7తో పాటు మరికొన్ని వాహనాలు ఉన్నాయని, అప్పులు లేవని పేర్కొన్నారు.