News August 31, 2025
రాజ్యాంగ సవరణే మార్గం: KTR

TG: BCలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లుపై KTR అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు 50% సీలింగ్ విధించింది. దీనిని అతిక్రమించే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయడమే ఏకైక మార్గం. పార్లమెంట్‌లో BJP, INCకే మెజార్టీ ఉంది. BCలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే అసెంబ్లీలో కాదు. 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే పరిష్కారం లభిస్తుంది’ అని చెప్పారు.
Similar News
News September 1, 2025
నిమ్స్‌లో ఉచిత గుండె ఆపరేషన్లు

TG: పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు నిమ్స్‌లో బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ టెస్టులు చేయనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 21 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే ఉచిత గుండె ఆపరేషన్లు చేస్తామన్నారు. ఈ ఖర్చును ఆరోగ్యశ్రీ, CMRF ద్వారా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో వైద్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News September 1, 2025
కాల భైరవ మంత్రాలు

* కష్టాలు తొలగడానికి: ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః
* వ్యాధి నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారణాయ నమః
* గ్రహదోష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమః
* దుఃఖ నివారణకు: ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః
* వివాహ సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః
News September 1, 2025
కవిత దృష్టిలో దెయ్యాలు వీరేనా?

TG: BRSలో కవిత కల్లోలం మరింత ముదిరింది. KCR చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో వ్యాఖ్యానించిన ఆమె, ఇవాళ ఏకంగా హరీశ్, సంతోష్ <<17582704>>పేర్లను<<>> బయటపెట్టడం సంచలనంగా మారింది. ఆమె చెప్పిన దెయ్యాలు వీరేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అటు కవిత ఆరోపణలను లెక్క చేయబోమని చెబుతూ వస్తున్న BRS నేతలు.. తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా హరీశ్, సంతోష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.