News March 24, 2025
రాజ్యాంగ మార్పు: DK, రాహుల్పై మండిపడ్డ BJP

కాంగ్రెస్ నేత DK శివకుమార్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై BJP మండిపడుతోంది. ‘ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని DK అంగీకరించారు. ఆ పార్టీ రాజ్యాంగానికి పెద్ద ముప్పు. అది అంబేడ్కర్, SC, ST, OBC వ్యతిరేకి’ అని షెజాద్ విమర్శించారు. ‘కాంగ్రెస్కు జాతీయ ప్రయోజనం కన్నా ముస్లిముల బుజ్జగింపే ప్రధానం. రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఎక్కడ’ అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.
Similar News
News November 14, 2025
200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుంది: CBN

AP: బిహార్లో ఎన్డీయే ఘన విజయం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్రబాబు స్పందించారు. విశాఖ CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. 200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుందని అన్నారు. ప్రజలంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంతలా ప్రజా నమ్మకం పొందిన వ్యక్తి మోదీ తప్ప మరెవరూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం నరేంద్ర మోదీది అని కొనియాడారు.
News November 14, 2025
గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

జూబ్లీహిల్స్లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.
News November 14, 2025
AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<


