News December 20, 2024

TGలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి: కేంద్రం

image

తెలంగాణలో గత పదేళ్ల కాలంలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణాలను పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు లోక్ సభలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 NHలు 4,926 కి.మీ పొడవు విస్తరించి ఉన్నాయని తెలిపారు. NHలకు లింక్ చేసేలా HYDలో టన్నెల్ రోడ్ల నిర్మాణం కోసం నిధులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.

Similar News

News January 29, 2026

కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. ఆయనకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ మరోసారి నోటీసులు ఇస్తుందా? ఎప్పుడు, ఎక్కడ విచారిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎర్రవల్లిలోనే <<18996095>>ప్రశ్నించాలని<<>> కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.

News January 29, 2026

నెలకు ₹5 లక్షల మేకప్.. పోలీసులకే షాకిచ్చిన ‘గ్లామరస్’ దొంగ

image

బెంగళూరులో ఓ ‘గ్లామరస్’ దొంగ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. భక్తి ముసుగులో గుళ్లు, రద్దీ ప్రదేశాల్లో బంగారాన్ని కాజేస్తున్న గాయత్రి, ఆమె భర్త శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ₹60 లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. సంపన్న మహిళగా కనిపిస్తే ఎవరూ గుర్తించరని.. అందుకోసం నెలకు ₹4-5 లక్షలు కేవలం మేకప్ కోసమే ఖర్చు చేస్తానని ఆమె అంగీకరించడం పోలీసులను షాక్‌కు గురిచేసింది.

News January 29, 2026

సహాయం చేయడంలోనే సంతోషం: విజయ్ సేతుపతి

image

ఇతరులకు సహాయం చేయడంలో, తను చేసే పనిలోనే సంతోషం ఉంటుందని యాక్టర్ విజయ్ సేతుపతి తెలిపారు. ఉపాధి లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రతినెలా రూ.లక్షన్నర ఖర్చు చేస్తున్నానని చెప్పారు. డబ్బు సంపాదిస్తేనే ఇవన్నీ చేయగలుగుతానని అప్పుడే సంతోషంగా ఉంటానన్నారు. సినిమాల్లోకి రాకముందు అకౌంటెంట్‌గా పనిచేశానని, ఆ పనిలోనూ ఆనందాన్ని పొందానని చెప్పారు. ఆయన నటించిన ‘గాంధీ టాక్స్’ రేపు విడుదల కానుంది.