News February 15, 2025
కోడ్ లేని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం: భట్టి

TG: MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలని I&PR, హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ORR, RRR చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించాలని సూచించారు. మధ్య తరగతి ప్రజల కోసం LIG, MIG, HIG ఇళ్లు కట్టాలని చెప్పారు.
Similar News
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.
News March 12, 2025
పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 12, 2025
వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.