News October 6, 2024
7 నెలల్లో స్కూళ్ల నిర్మాణాలు పూర్తి: భట్టి

TG: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని, 7 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామని డిప్యూటీ CM భట్టి చెప్పారు. దేశానికే ఆదర్శంగా ఈ స్కూల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉంటుందని, ఒక్కో స్కూలుకు రూ.25కోట్లు ఖర్చు చేస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Similar News
News April 10, 2026
IPL: చరిత్ర సృష్టించారు

KKRతో మ్యాచ్‌లో LSG ప్లేయర్లు ముకుల్ చౌదరి, అవేశ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సక్సెస్‌ఫుల్ <<19611855>>రన్ ఛేజ్‌లో<<>> 8th వికెట్ లేదా అంతకంటే దిగువన అత్యధిక భాగస్వామ్యం(54*) నమోదు చేసిన జోడీగా నిలిచారు. ఇందులో ముకుల్ ఒక్కరే 52 రన్స్ చేశారు. అలాగే లక్ష్య ఛేదనలో ఏడో నంబర్/దిగువన బ్యాటింగ్‌కు వచ్చి హయ్యెస్ట్ సిక్సర్లు(7) బాదిన ప్లేయర్‌గా బ్రావో సరసన ముకుల్ చేరారు.
News April 10, 2026
RBI కొత్త ప్రతిపాదన.. రూ.10,000+ పంపిస్తే!

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ₹10వేలకు మించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రిసీవర్ ఖాతాలో ఆ నగదు జమ అయ్యేందుకు ఒక గంట సమయం పట్టేలా రూల్ తేనుంది. ఈలోగా మనీ పంపినవారు వద్దనుకుంటే ఆ బదిలీని రద్దు చేయవచ్చు. బ్యాంకులూ అనుమానాస్పద లావాదేవీలపై అలర్ట్ చేస్తాయి. మర్చంట్, రికరింగ్, చెక్ పేమెంట్స్‌కు ఇది వర్తించదు. దీనిపై మే8 వరకు RBI అభిప్రాయాలు స్వీకరించనుంది.
News April 10, 2026
రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే..

రాగుల్లో ప్రొటీన్స్, ఐరన్, ఫైబర్, అమైనో అమ్లాలు, విటమిన్ C, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రోజూ ఈ జావను తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
#ShareIt


