News October 24, 2024

కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక

image

AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.

Similar News

News December 20, 2025

ఆ ఎమ్మెల్యేలు BRS భేటీకి వస్తారా?

image

TG: తాము INCలో చేరలేదని ఐదుగురు BRS MLAలు నివేదించడంతో వారిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే KCR ఆధ్వర్యంలో రేపు BRS కార్యవర్గం, LPల భేటీ జరగబోతోంది. పార్టీలోనే ఉన్నామని పేర్కొన్న ఆ MLAలు T.వెంకటరావు, A.గాంధీ, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలు ఈ భేటీకి హాజరవుతారా? కారా? అన్నది ఆసక్తిగా మారింది. మిగతా సభ్యులు యాదయ్య, పోచారం, సంజయ్, నాగేందర్, కడియం రాక పైనా చర్చ సాగుతోంది.

News December 20, 2025

రబీ వరి సాగు.. ఎప్పటిలోగా విత్తుకోవాలి

image

APలో కొన్నిచోట్ల ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోతలు పూర్తైన భూముల్లో 125 రోజుల కాలపరిమితి గల వరి రకాలను ఇప్పటికే నాటుకోవాలి. ఒకవేళ ఎద పద్ధతిలో సాగు చేయాలనుకుంటే డిసెంబర్ 31 లోపు విత్తు కోవాలి. ఖరీఫ్ పంటకోత మరీ ఆలస్యమైతే 120 రోజుల కాల పరిమితి వరి రకాలను జనవరి మొదటి వారంలోపు ఎద పద్ధతిలో వేసుకోవాలి. దీని వల్ల రబీ వరి కోతలను ఏప్రిల్ 10లోపు పూర్తి చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 20, 2025

ఉద్యోగ యోగాన్ని కల్పించే ‘బెంగళూరు గణేష్’

image

బెంగళూరు జయనగర్‌లోని కెరీర్ వినాయక ఆలయం నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, పదోన్నతులు కోరేవారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుందని నమ్మకం. సంకల్ప పూజలు, ప్రదక్షిణలతో నిరుద్యోగులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. విద్యావంతులు, యువతతో ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి భరోసాను కల్పిస్తోంది.