News November 16, 2024
ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ: చంద్రబాబు
AP: ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రకటించారని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేసేలా నిబంధన పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో జనాభా పెంచాలి. 30, 40 కోట్ల మంది విదేశాలకు వెళ్లి ఆదాయం తీసుకురావాలి. ఒకప్పుడు బ్రిటిష్ వారు ఏలినట్లు, ఇప్పుడు మనం ఏలాలి. ఇందుకు పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 16, 2024
నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు!
యూరప్‌లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ట్రోవాంట్స్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. అప్పటివరకూ సాధారణ శిలల్లా కనిపించే ఈ భౌగోళిక అద్భుతాలు వర్షపు నీటిని పీల్చుకుని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అచ్చం జీవిలానే ప్రవర్తిస్తాయి. ఈ దృగ్విషయం స్థానికులు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
News November 16, 2024
ట్రంప్‌ను చంపే ఆలోచన లేదు: ఇరాన్
ట్రంప్‌ను హత్య చేసే ఆలోచన తమకు లేదని అమెరికాకు ఇరాన్ వివరణ ఇచ్చింది. Sepలో ఇరాన్‌తో జో బైడెన్ యంత్రాంగం సమావేశమైంది. ట్రంప్‌పై ఏరకమైన దాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగా పరగణిస్తామని US స్పష్టం చేసింది. దీంతో Octలో ఇరాన్ ‘ఆ ఆలోచన లేద’ని బదులిచ్చినట్టు సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశానుసారం జరిగిన దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాని హతమవ్వడంతో ఇద్దరి మధ్య రగడ ప్రారంభమైంది.
News November 16, 2024
రేపు వరంగల్‌లో విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు వరంగల్ హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ చిత్రాన్ని రవితేజ ముళ్లపూడి తెరకెక్కించారు.