News May 3, 2024
స్మృతీపై పోటీ.. ఎవరీ కిషోరీ లాల్ శర్మ?

అమేథీలో కేంద్రమంత్రి, BJP అభ్యర్థి స్మృతీ ఇరానీకి పోటీగా కిషోరీ లాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. 4దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న కిషోరీ.. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన స్వస్థలం పంజాబ్లోని లుథియానా. సోనియా గాంధీ అందుబాటులో లేనప్పుడు రాయ్ బరేలీతో పాటు రాహుల్ పోటీ చేసి ఓడిన అమేథీ నియోజకవర్గాన్ని సైతం శర్మ పర్యవేక్షిస్తుంటారు. అప్పుడప్పుడు పర్యటనలు చేస్తుంటారు.
Similar News
News December 7, 2025
తల్లయిన హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్ను వివాహం చేసుకున్నారు.
News December 7, 2025
తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్: పొంగులేటి

TG: రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దిశా దశను మార్చనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. సుమారు 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారని చెప్పారు.
News December 7, 2025
గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్ మిక్స్డ్ రేషన్)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.


