News June 29, 2024
హరియాణాలో ఒంటరిగా పోటీ: అమిత్ షా

ఈ ఏడాది హరియాణాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మరోసారి CM అభ్యర్థిగా నయబ్ సింగ్ సైనీనే ఉంటారని సంకేతాలిచ్చారు. 2019లో బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో JJPతో పొత్తు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్ల విషయమై గొడవలు తలెత్తడంతో పొత్తు వీగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP తలో 5 సీట్లు గెలుచుకున్నాయి.
Similar News
News January 17, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 17, 2026
BREAKING: మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

TG: కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
*నిజామాబాద్- మహిళ జనరల్ *నల్గొండ- మహిళ జనరల్
*ఖమ్మం- మహిళ జనరల్ *గ్రేటర్ వరంగల్- జనరల్
*GHMC- మహిళ జనరల్ *కరీంనగర్- బీసీ జనరల్
*మంచిర్యాల- బీసీ జనరల్ *మహబూబ్నగర్- బీసీ మహిళ
*రామగుండం- ఎస్సీ జనరల్ *కొత్తగూడెం- ఎస్టీ జనరల్
News January 17, 2026
3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు.


