News April 2, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు సమకూరింది. ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

Similar News

News January 20, 2026

మాఘ మాసంలో చేయాల్సిన పూజలివే..

image

మాఘ మాసంలో నారాయణుడిని, శివుడిని పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని, రథసప్తమి నాడు సూర్యుడిని, భీష్మ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం శ్రేష్టం. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో శివార్చన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూజలతో పాటు శక్తి కొలది నువ్వులు, బెల్లం, ఉప్పు, వస్త్రాలను దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని పురాణాల వాక్కు. ఆదివారం సూర్యారాధన చేయాలి.

News January 20, 2026

చలికాలం.. పంటలో పురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

image

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.

News January 20, 2026

నేడు దావోస్‌లో CM చంద్రబాబు కీలక భేటీలు

image

రెండోరోజు దావోస్‌లో CM చంద్రబాబు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. CII బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై మాట్లాడతారు. అనంతరం ఇండియా లాంజ్ ప్రారంభ కార్యక్రమంలో ఇన్వెస్టర్స్‌తో సమావేశమవుతారు. తర్వాత IBM CEO అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ CEO థామస్‌ను కలుస్తారు. ఈవినింగ్ JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, JSW సిమెంట్స్, పెయింట్స్ సంస్థల MD పార్థ్ జిందాల్‌తో కూడా సమావేశమవుతారు.