News June 19, 2024
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.
Similar News
News February 3, 2025
రేపే రథసప్తమి.. విశేషాలివే
మాఘ శుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకొంటారు. ఆరోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. దేశవ్యాప్తంగా సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్య పూజ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, సిరి సంపదల్ని చేకూరుస్తుందనేది భక్తుల విశ్వాసం. సూర్యకిరణాలు ఒంటిపై పడటం ఆరోగ్యకరమని నమ్మిక. ఆదిత్య హృదయం, సూర్యాష్టోత్తర శతనామాల పఠనం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు.
News February 3, 2025
బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు: మంత్రి
TG: <<15340893>>కులగణనపై<<>> సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తాం. కొందరు సర్వేకు సహకరించలేదు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారు. కాస్ట్ సెన్సస్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు’ అని కోరారు.
News February 3, 2025
ఆ రైలు ఎంత లేటుగా వచ్చిందో తెలుసా!
నీవెక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారో సినీకవి. నిత్యం లక్షలాదిమందితో వేలాది గమ్యస్థానాల మధ్య ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్థం చేసుకోదగినదే. కానీ మరీ 72 గంటల లేటైతే? అనధికారిక వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని కోటా నుంచి పట్నా వెళ్లాల్సిన 13228 నంబర్ రైలు 2017లో 72 గంటలు లేటుగా వచ్చింది! రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ (2014లో 71 గంటలు) పేరిట ఉంది.