News June 28, 2024

స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిన్న తొలిసారిగా సెన్సెక్స్ 79వేల మార్క్, నిఫ్టీ 24వేల మార్క్ దాటగా ఈరోజు ఆ జోరును కొనసాగిస్తున్నాయి. 278 పాయింట్ల లాభంతో 79,519 వద్ద దూసుకెళ్తున్న సెన్సెక్స్ ఓ దశలో గరిష్ఠంగా 79,671కు చేరింది. నిఫ్టీ 100కుపైగా పాయింట్లు ఎగిసి 24,145 వద్ద ట్రేడవుతోంది. డాక్టర్ రెడ్డిస్, SBI, ONGC, టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

Similar News

News January 26, 2026

అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?

image

చైనా మిలిటరీ ఆఫీసర్ జనరల్ జాంగ్ యూక్సియా తమ దేశ అణు ఆయుధాల టెక్నికల్ డేటాను USకి లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీనిపై చైనా రక్షణ శాఖ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జాంగ్ యూక్సియాపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

News January 26, 2026

ప్చ్ శాంసన్.. 9 ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు

image

టీ20Iల్లో ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. 2025 జూన్ నుంచి 9 ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు (Avg 11.55, SR 133.33) మాత్రమే చేశారు. వీటిలో ఒక్కసారి మాత్రమే పవర్ ప్లేలో నాటౌట్‌గా నిలిచారు. ఈ 9 ఇన్నింగ్స్‌ల స్కోర్లు 26(20), 5(7), 3(6), 1(3), 16(7), 37(22), 10(7), 6(5), 0(1)గా ఉన్నాయి. తాజాగా NZ సిరీస్‌లో ఫెయిల్ అవుతుండటంతో తుది జట్టులో ఆయనకు స్థానం దక్కే అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

News January 26, 2026

కొత్త సినిమా ప్రకటించిన హీరో నితిన్

image

డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. ‘NO BODY NO RULES’ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే. కాగా VI ఆనంద్ గతంలో ‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన’ సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీ అయినా నితిన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి.