News September 19, 2024

స్కిల్ యూనివర్సిటీకి సహకరించండి: రేవంత్

image

TG: స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని CM విజ్ఞప్తి చేశారు. అటు రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.

Similar News

News December 6, 2025

కాకర పంటను ఇలా సాగు చేస్తే మంచిది

image

కాకర పంటను పందిరి విధానంలో సాగు చేస్తే పంట నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచి ధర దక్కుతుంది. అలాగే దిగుబడి 40-50శాతం పెరుగుతుంది. కాకరను సారవంతమైన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో మాత్రమే సాగు చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందిస్తే, ఎరువుల ఆదాతో పాటు, పెట్టుబడి కూడా కొంత తగ్గుతుంది. రసాయన పురుగు మందులే కాకుండా వేప ఉత్పత్తులతో కూడా చీడలను సంపూర్ణంగా నివారించి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.

News December 6, 2025

ఇవాళ మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరంజిల్లా రాజాంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన, 18- 40ఏళ్ల వయసు గలవారు GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 35 MNCలు నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నాయి.

News December 6, 2025

‘మహానటి’ నుంచి ఈతరం ఏం నేర్చుకోవాలంటే?

image

మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంత స్టార్‌డమ్ వచ్చినా మూలాలను మర్చిపోకుండా సాధారణ నటిగానే మెలిగారు. ప్రత్యేక ఏర్పాట్లు, సెపరేట్ స్టాఫ్, అనవసరపు ఖర్చులతో ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టలేదు. జూనియర్ ఆర్టిస్టులతో కలివిడిగా ఉండేవారు. యూనిట్ సభ్యులను బాగా చూసుకునే వారు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇవాళ సావిత్రి 90వ జయంతి.