News March 3, 2025
వివాదాస్పద జీన్స్.. వేలంలో రూ.31 లక్షలు

ఇటీవల వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలో మాగ్నస్ కార్ల్సన్ జీన్స్ ధరించడం <<15001679>>వివాదాస్పదమైంది<<>>. డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించకపోవడంతో FIDE జరిమానా విధించింది. దీంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ జీన్స్ను కార్ల్సన్ తాజాగా వేలం వేశారు. దానికి 94 బిడ్లు రాగా ఓ వ్యక్తి రూ.31 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ ఛారిటీకి మాగ్నస్ అందజేయనున్నారు.
Similar News
News March 4, 2025
TODAY HEADLINES

* TG: MLCలుగా మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి విజయం
* TG: ఇంటర్ ఎగ్జామ్స్.. 5min లేటైనా అనుమతి
* AP ఎక్కువ నీరు తీసుకుంటోంది.. అడ్డుకోండి: రేవంత్
* త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
* ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు గెలుపు
* చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ
* రోహిత్పై కాంగ్రెస్ నేత కామెంట్స్.. పొలిటికల్ హీట్
* సూచీలు ఫ్లాట్.. ఆదుకున్న మెటల్, రియల్టీ స్టాక్స్
News March 4, 2025
రాత్రిపూట నేలపై పడుకుంటే..

వేసవి వచ్చేసింది. ఉక్కబోత అల్లాడించే ఈ కాలంలో పరుపు నుంచి కూడా వేడి వస్తుంటుంది. అసలే రోజంతా పనులతో అలసిపోయిన శరీరం కునుకు తీసేందుకు పరుపుపై వాలగానే ఏదో అసౌకర్యం. అలాంటప్పుడు చక్కగా నేలపై నిద్రపోవడం చాలా మంచిదంటున్నారు జీవనశైలి నిపుణులు. చల్లటి నేలపై మంచి నిద్రే కాక ఒళ్లు నొప్పులకూ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నేలపై నిద్రను హాయిగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు.
News March 4, 2025
క్రికెట్ అంటే తెలియనివాళ్లు ఇలా మాట్లాడటం విడ్డూరం: భజ్జీ

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ బాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని హితవు పలికారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అని, గొప్ప నాయకుడని భజ్జీ కొనియాడారు.