News August 31, 2024
వివాదాస్పదంగా అచ్చెన్నాయుడి సోదరుడి ప్రమోషన్?

AP: మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడు ప్రమోషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నేటితో ఆయన రిటైర్ కానుండగా నిన్న DSP నుంచి ASPగా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కి ఆయనకు ప్రమోషన్ కల్పించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆయన ఒక్కరి కోసం 32 మందికి ASPలుగా ప్రమోషన్ ఇచ్చారని విమర్శిస్తోంది. వీరంతా ASPలుగా రిటైరైతే ఖజానాపై అనవసర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Similar News
News November 19, 2025
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.
News November 19, 2025
9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
News November 19, 2025
టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్‌సైట్‌లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


