News July 17, 2024
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఇంటిపైకి బుల్డోజర్

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఇంటి బయట ఉన్న అక్రమ నిర్మాణాలను పుణే మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్తో కూల్చేస్తోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, వారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు వివరించారు. బ్యూరోక్రాట్‌గా పదవిని దుర్వినియోగం చేయడం, తప్పుడు పత్రాల్ని సమర్పించడం వంటి పలు ఆరోపణల్ని పూజ ఎదుర్కొంటున్నారు.
Similar News
News April 9, 2026
IPL: నేడు LSGvsKKR.. గెలిచేదెవరు?

ఈరోజు కోల్‌కతా వేదికగా LSG, KKR 7.30PMకి తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు LSG రెండు మ్యాచులు ఆడి ఒక దాంట్లో గెలిచింది. అటు బౌలింగ్‌లో తడబడుతున్న KKR ఇంకా బోణీ కొట్టలేదు. 3 మ్యాచుల్లో 2 ఓడింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. గత మ్యాచుకు దూరమైన నరైన్ ఈరోజు ఆడే అవకాశముంది. గాయపడ్డ వరుణ్ ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా నేటి మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని CricBuzz పేర్కొంది.
News April 9, 2026
కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>
News April 9, 2026
‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్యూటీ?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో యంగ్ హీరోయిన్ మానస వారణాసి స్టెప్పులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్ కోసం మూవీ టీమ్ ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్యూటీ ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. కాగా స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.


