News February 2, 2025
రంజీలో వివాదం: బ్యాటింగ్ చేసేందుకు జమ్మూకశ్మీర్ నిరాకరణ

బరోడా, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతిథ్య బరోడా జట్టు పిచ్‌ను రెండో రోజు రాత్రి మార్చేసిందని ఆరోపిస్తూ JK జట్టు 3వ రోజు బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించింది. దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. మల్లగుల్లాల అనంతరం ఎట్టకేలకు బ్యాటింగ్ ఆడింది. చివరికి మ్యాచ్‌ను కశ్మీర్ 182 పరుగుల తేడాతో గెలిచింది.
Similar News
News January 22, 2026
భారత్ అంత చేసినా.. బరితెగించిన బంగ్లా!

భారత్‌లో T20 WC ఆడబోమన్న బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి ఆ దేశ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించిందే BCCI. 1988లో BCBకి అప్పటి ICC ఛైర్మన్ జగ్మోహన్ దాల్మియా ICCలో సభ్యత్వం ఇప్పించారు. తర్వాత BCCI ఆ జట్టుకు టెస్ట్ హోదా లభించేలా చేసింది. ఇంకా చెప్పాలంటే 1971లో పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాను స్వతంత్ర దేశంగా చేసిందే భారత్. బంగ్లా తీరుపై మీరేమంటారు?
News January 22, 2026
ఇది లొట్టపీసు కేసు.. బరాబర్ విచారణకు వెళ్తా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప పీకిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది లొట్టపీసు కేసు. ఇప్పటివరకు నేను ఆ నోటీసులే చూడలేదు. అయినా బరాబర్ విచారణకు వెళ్తా. ఎవరికీ భయపడేది లేదు. రేవంత్‌కు అసలే భయపడను. మేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు వదిలిపెట్టం’ అని సిరిసిల్ల ప్రెస్మీట్లో స్పష్టం చేశారు.
News January 22, 2026
టెక్ యుగంలో వెండి కీలక లోహం: రాబర్ట్ కియోసాకి

వెండికి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రాధాన్యం వస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. వెండి కేవలం డబ్బుగా కాకుండా టెక్నాలజీ యుగంలో “స్ట్రక్చురల్ మెటల్”గా మారిందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో దీని వినియోగం పెరుగుతోందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ప్రస్తుత టెక్ యుగంలో వెండి అంతే కీలకంగా మారిందని తెలిపారు.


