News November 29, 2024
PM విశ్వకర్మ పథకంపై తమిళనాడులో వివాదం
కుల ఆధారిత అసమానతలను పెంపొందించే అవకాశం ఉన్నందున ‘PM విశ్వకర్మ’ పథకాన్ని తిరస్కరిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 రకాల చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించే ఈ పథకానికి వారసత్వంగా వృత్తిని స్వీకరించిన వారే అర్హులనడం వివాదమైంది. ఇతర వర్గాలను ఎంపిక చేయకపోవడం వివక్ష చూపడమే అని పేర్కొంది. అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ తామే కొత్త పథకాన్ని తెస్తామని తెలిపింది.
Similar News
News November 29, 2024
20 ఏళ్లుగా ముక్కులో ఉండిపోయిన పాచిక!
చైనాకు చెందిన షావోమా(23) అనే వ్యక్తి చాలాకాలంగా తుమ్ములు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎండోస్కోపీ చేయగా ముక్కులో 2 సెం.మీ సైజున్న ఓ పాచిక(డైస్)ను గుర్తించారు. తనకు మూడేళ్లున్నప్పుడు అది ముక్కులోకి వెళ్లి ఉండొచ్చని షావోమా తెలిపారు. దాని చుట్టూ కండ కూడా పెరిగిపోవడంతో వైద్యులు జాగ్రత్తగా తొలగించారు. ఇన్నేళ్లుగా ముక్కులో పాచికతో సమస్యల్లేకపోవడం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News November 29, 2024
పృథ్వీషా అంత డబ్బును హ్యాండిల్ చేయలేకపోయాడు: మాజీ కోచ్
డబ్బు, కీర్తిని పృథ్వీ షా హ్యాండిల్ చేయలేకపోయారని ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కోచ్ ప్రవీణ్ ఆమ్రే అభిప్రాయపడ్డారు. ‘నైపుణ్యం కలిగిన ఆటగాడు ఇలా వృథా కావడం బాధాకరం. డీసీ పుణ్యమా అని 23 ఏళ్లకే రూ.30-40 కోట్లు సంపాదించుకున్నాడు. కాంబ్లీ ఎలా దిగజారాడో మూడేళ్ల క్రితమే పృథ్వీకి వివరించాను. కానీ చిన్నవయసులో అంత డబ్బు చూశాక షాకి ఆట మీద ఫోకస్ తగ్గింది. IPLలో అన్సోల్డ్ కావడం అతడి మంచికే’ అని వ్యాఖ్యానించారు.
News November 29, 2024
ఇందిరమ్మ ఇళ్లపై CM రేవంత్ కీలక ప్రకటన
TG: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని CM రేవంత్ అన్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తే అదనపు గదులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని CM ఆదేశించారు.