News July 28, 2024
వివాదం: కేరళ బ్యాంకు నివాళుల జాబితాలో ముషారఫ్ పేరు

కేరళలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అలప్పుళ శాఖ చేసిన ఓ పని కలకలం రేపింది. ఓ కార్యక్రమంలో నివాళులర్పించేందుకు సిద్ధం చేసిన ప్రముఖుల జాబితాలో పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ పేరును చేర్చింది. 25వ కార్గిల్ విజయ దివస్ జరిగిన మరుసటి రోజే.. ఆ యుద్ధానికి కారణమైన ముషారఫ్ పేరును లిస్టులో పెట్టడం గమనార్హం. అనుకోకుండా జరిగిందంటూ బ్యాంకు ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పింది. దీనిపై బీజేపీ అలప్పుళలో నిరసన వ్యక్తం చేసింది.
Similar News
News December 10, 2025
రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.
News December 10, 2025
మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా: ట్రంప్

అధ్యక్షుడిగా తన తొలి టర్మ్లో US ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే బలమైనదిగా నిలిపానని ట్రంప్ అన్నారు. ఈసారి మరింత పెద్దగా, గతంలో ఎన్నడూ చూడని దృఢమైన వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడకపోతే దేశ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి రాకముందు కొత్త ఉద్యోగాలన్నీ వలసదారులకు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.
News December 10, 2025
గొడవలు ఎందుకొస్తాయంటే?

ఏ రిలేషన్షిప్లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.


