News August 30, 2024

ఎమర్జెన్సీ చిత్రంపై వివాదం.. కంగన స్పందన ఇదే

image

ఎమ‌ర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తానని నటి కంగన రనౌత్ తెలిపారు. చిత్రంపై సిక్కు వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ‘మీరు(విమర్శకులు) చరిత్రను మార్చలేరు. నన్ను బెదిరించి భయపెట్టలేరు. స‌ర్టిఫికెట్ వ‌చ్చే కొన్ని రోజుల ముందు చాలా మంది డ్రామా చేశారు. సెన్సార్ బోర్డ్ ఎక్కువ సంకోచిస్తోంది’ అని తప్పుపట్టారు.

Similar News

News January 31, 2025

OTTలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

image

టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’ ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో ఈ మూవీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

News January 31, 2025

బాత్‌రూమ్‌లోనే టూత్‌బ్రష్ పెడుతున్నారా?

image

దంతాలను శుభ్రం చేసుకున్నాక <<15261921>>టూత్‌బ్రష్‌లను<<>> బాత్‌రూమ్‌లోనే పెట్టడం ప్రమాదమని సిద్దిపేట GOVT డిగ్రీ కాలేజీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. కమోడ్‌ ఫ్లష్ చేసినప్పుడు నీతి తుంపర్ల ద్వారా 3రకాల బ్యాక్టీరియా బ్రష్‌లపైకి చేరుతోందని గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ వల్ల దంతాల అరుగుదల, స్టెఫైలోకోకస్ ఆర్యస్‌తో మౌత్ అల్సర్, ఈ-కొలి వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బ్రష్‌లను ఎండ తగిలే చోట పెట్టాలంటున్నారు.

News January 31, 2025

రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు

image

APవ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10-20% పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు ₹740, ₹580, ₹420 వసూలు చేస్తారు. ప్లాట్‌లకు(G,1st, 2nd ఫ్లోర్)రూ.1,490, రూ.1,270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.