News September 8, 2024
మండపాలకు చలాన్లపై వివాదం.. మీరు డబ్బు కట్టారా?

AP: గణేశ్ మండపాల్లో మైక్సెట్కు రూ.100, విగ్రహం హైట్ను బట్టి రూ.350-700 చలానా చెల్లించాలని ఇటీవల చెప్పిన హోంమంత్రి అనిత ఇవాళ <<14051538>>మరోరకంగా<<>> స్పందించారు. ఆ జీవోను జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని, తాము రూపాయి కూడా వసూలు చేయట్లేదని చెప్పారు. అయితే పలువురు భక్తులు తాము మండపాలకు కట్టిన చలాన్ల రసీదు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
మీరు మండపాలకు చలానా కట్టారా? కామెంట్ చేయండి.
Similar News
News October 19, 2025
తెలంగాణ రౌండప్

➤ 3,465 మంది సర్వేయర్లకు నేడు HYDలోని శిల్పకళావేదికలో లైసెన్స్లు అందజేయనున్న సీఎం రేవంత్
➤ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్తో సహా 40 మంది రంగంలోకి.. నిన్నటి వరకు 96 నామినేషన్లు దాఖలు
➤ 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్, బోధనా రుసుము దరఖాస్తు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
➤ 34 R&B రహదారులను రూ.868 కోట్లతో బలోపేతం, విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
News October 19, 2025
రాశులను ఎలా నిర్ణయిస్తారు?

వ్యక్తి పుట్టిన సమయం, ప్రదేశం ఆధారంగా రాశులను నిర్ణయిస్తారు. ఆ జన్మించిన సమయానికి ఆకాశంలో చంద్రుడు ఉన్న రాశినే వారి జన్మ రాశిగా పరిగణిస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది వారి జన్మ నక్షత్రం అవుతుంది. పుట్టిన సమయానికి తూర్పున ఉదయించే రాశిని జన్మ లగ్నంగా వ్యవహరిస్తారు. జన్మ రాశి, నక్షత్రాల ఆధారంగానే జాతక ఫలితాలు నిర్ణయమవుతాయి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను జ్యోతిషం <<-se_10008>>కేటగిరీకి<<>> వెళ్లి చూడొచ్చు.
News October 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 40

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. ఎవరి అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు?
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ఏమంటారు?
4. ‘హనుమాన్ చాలీసా’ను రచించిన భక్తుడు ఎవరు?
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>