News October 26, 2025
అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం LICతో ₹33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న Washington Post కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల LIC వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
Similar News
News October 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <
News October 26, 2025
ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.
News October 26, 2025
ఆధార్ వివరాలివ్వని ఉద్యోగుల జీతాలు కట్.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు

TG: ఆధార్ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతాన్ని ఆపేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల వివరాలను సమర్పించేందుకు ఈ నెల 25 వరకు రెండు సార్లు గడువు పొడిగించినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 5.21 లక్షల మంది రెగ్యులర్, 4.93 లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పని చేస్తున్నారు. శనివారం రాత్రి నాటికి టెంపరరీ ఉద్యోగుల్లో 3.75 లక్షల మంది వివరాలను IFMIS పోర్టల్‌లో నమోదు చేసినట్లు సమాచారం.


