News October 15, 2024
దీపావళి పండుగ తేదీపై వివాదం

AP: ఈ ఏడాది దీపావళి పండుగ తేదీపై పంచాంగకర్తల మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్ 31న జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగకర్తలు, నవంబర్ 1 అసలు తేదీ అని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. రేలంగి పంచాంగాన్ని TTD అనుసరిస్తుండటంతో ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే వారు సరైన పద్ధతిలో గణించలేదని, సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలని ధృక్ పంచాంగకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News November 19, 2025
రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
News November 19, 2025
హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.
News November 19, 2025
ఇండియా-ఎ ఓటమి

సౌతాఫ్రికా-ఎతో జరిగిన 3వ అనధికారిక వన్డేలో భారత్-ఎ 73 రన్స్ తేడాతో ఓడిపోయింది. SA నిర్దేశించిన 326 రన్స్ టార్గెట్ను ఛేదించలేక 252 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఆయుష్ బదోని(66), ఇషాన్ కిషన్(53) మినహా ఎవరూ రాణించలేదు. రుతురాజ్ 25, అభిషేక్ 11, తిలక్ వర్మ 11, పరాగ్ 17 రన్స్కే ఔటై నిరాశపరిచారు. అంతకుమందు SA ఓపెనర్లు ప్రిటోరియస్(123), మూన్సమీ(107) సెంచరీలతో చెలరేగారు.


