News March 6, 2025
ఏపీలో ‘ఛావా’ సినిమాపై వివాదం

‘ఛావా’ సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్దని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హక్ డిమాండ్ చేశారు. ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారని, రిలీజ్‌ను ఆపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. ఇందులో ముస్లింలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
Similar News
News October 24, 2025
భార్య చేసే పూజా ఫలితాలు భర్తకు దక్కుతాయా?

‘భర్త ఓ పుణ్య కార్యం చేస్తే.. ఆ పుణ్యం భార్యకు దక్కుతుంది. కానీ పాప కార్యంలో పాపం మాత్రం ఆమెకు అంటదు. అలాగే భార్య పూజలెన్ని చేసినా ఆ ఫలితం భర్తకు దక్కదు’ అని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. భర్త తను చేసే తప్పులకు భార్య చేసే పూజలతో విముక్తి కలుగుతుందని అనుకొనే అవకాశాలుంటాయి. ఇంటి పెద్దైన భర్త అలాంటి తప్పులు చేయకూడదనే ఈ నియమాన్ని పెట్టారు. భార్య చేసే పూజల్లో తోడుంటేనే భర్తకు కూడా ఆ ఫలితం దక్కుతుంది.
News October 24, 2025
విమానాల మాదిరి AC బస్సుల్లోనూ చెప్పాలా?

విమానం బయల్దేరే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ల గురించి ఫ్లైట్ క్రూ వివరిస్తారు. అలాగే AC బస్సుల్లోనూ ఎమర్జెన్సీ డోర్ల గురించి చెబితే కర్నూలు లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సులో కింద సీట్లలోని వారు తప్పించుకోవడానికి కొంత ఛాన్స్ ఉన్నా, పైసీట్లలోని వారు డోర్ ద్వారా బయటకు రావడం కష్టం. అందుకే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
News October 24, 2025
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


