News October 17, 2024

కెనడాతో వివాదం: మోదీని నిందిస్తూ TMC MP ట్వీట్లు!

image

కెనడాతో వివాదంపై TMC MP, రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య సాగరికా ఘోష్ ట్వీట్లు చర్చనీయంగా మారాయి. ‘మోదీ ప్రభుత్వ క్రిమినల్ యాక్టివిటీపై కెనడా PM ట్రూడో పబ్లిక్‌గా అభియోగాలు ఎందుకు మోపుతున్నారో నాన్ బయలాజికల్ PM మోదీ పార్లమెంటుకు చెప్పాలి’ అని ఆమె మొదట ట్వీట్ చేశారు. అప్పట్నుంచి ప్రధాని టార్గెట్‌గా ట్వీట్లు చేస్తుండటంతో ‘మీ నుంచి ఇంతకు మించి ఆశించడం వేస్ట్’ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.>comment

Similar News

News January 3, 2025

వారికి నియామక పత్రాలు ఎప్పుడిస్తారు?: RSP

image

TG: జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్-4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటని, ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు.

News January 3, 2025

Stock Markets: ఒక్కరోజు మురిపెం!

image

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 24,090 (-104), సెన్సెక్స్ 79,517 (-422) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. PSU BANK, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. ONGC, TRENT, SHRIRAMFIN, TITAN, NTPC టాప్ గెయినర్స్. నిఫ్టీ ADV/DEC 20:30.

News January 3, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్

image

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 9 నుంచి 22 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.25 ఫైన్‌తో ఈ నెల 23 నుంచి 29 వరకు, రూ.50 లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఆ తర్వాత తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు కట్టుకోవచ్చు.