News July 7, 2024

TRSను BRSగా మార్చి పేగుబంధం తెంచుకున్నాం: వినోద్

image

TG: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల తాము తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని, దురదృష్టవశాత్తు ఇందులో తాను కూడా పాత్రధారినేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.. బీఆర్ఎస్ పవర్‌లో లేకపోయినా పవర్‌ఫుల్ పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అంశంతో ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని తాజాగా జరిగిన పార్టీ మీటింగ్‌లో చెప్పారు.

Similar News

News October 6, 2024

3 రోజుల్లో రూ.27వేల కోట్లు వెనక్కి

image

ఫారిన్ ఇన్వెస్టర్లు చివరి 3 సెషన్లలోనే రూ.27,142 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ ఏషియాలో వార్, క్రూడాయిల్ ధరలు, చైనా మార్కెట్లు పుంజుకోవడమే ఇందుకు కారణాలు. స్టిమ్యులస్ ప్యాకేజీ, మానిటరీ పాలసీతో చైనా మార్కెట్లు గత నెల్లో 26% ఎగిశాయి. అక్కడి షేర్ల విలువ తక్కువగా ఉండటంతో FPIలు డబ్బును అక్కడికి మళ్లిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. CY24 SEP నాటికి వీరి పెట్టుబడులు రూ.57,724 కోట్లకు చేరాయి.

News October 6, 2024

క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే నిలిచిన SAARC: జైశంకర్

image

ఒక మెంబర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే సార్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని EAM జైశంకర్ అన్నారు. ఈ నెల్లోనే SCO మీటింగ్ కోసం పాక్ వెళ్తుండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెర్రరిజాన్ని సహించేది లేదు. మాలో ఒకరు మరొకరిపై అలా చేస్తే దాన్ని ఆపాల్సిందే. అందుకే సార్క్ మీటింగ్స్ జరగడం లేదు. అయితే గత ఐదారేళ్లలో బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకతో భారత్ బంధం మెరుగైంది’ అని వివరించారు.

News October 6, 2024

ఆరోజు నమ్మకపోతే ‘శివ’,నేనూ ఉండేవాళ్లం కాదు: RGV

image

‘శివ’ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నా లైఫ్‌కి బ్రేక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అచంచలమైన మద్దతు, నాపై సంపూర్ణ విశ్వాసం లేకపోతే శివతో పాటు నేనూ ఉండేవాడినికాదు’ అని ట్వీట్ చేశారు. వర్మ తన కెరీర్‌ను ‘శివ’తో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.