News August 14, 2024
దోషిని ఉరి తీయాలి: CM మమతా బెనర్జీ

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషిని ఉరితీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అవసరమైతే దీని కోసం ర్యాలీ తీస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని సీబీఐకి సమర్పించినట్టు తెలిపారు. ‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉరితీయడమే మాకు కావాలి. వచ్చే ఆదివారం వరకు సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు.
Similar News
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.
News February 16, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<
News February 16, 2026
TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

* నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్‌గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష(కాంగ్రెస్)


