News October 16, 2024
ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో కుక్, డివిలియర్స్, నీతూ డేవిడ్

అలెస్టర్ కుక్, నీతూ డేవిడ్, ఏబీ డివిలియర్స్‌కు (ICC) హాల్ ఆఫ్ ఫేమ్(2024)లో చోటు దక్కింది. కుక్(ఇంగ్లండ్) 161 టెస్టులు- 12,472 రన్స్, 92 ODIల్లో 3,205 రన్స్, 4 టీ20ల్లో 61 రన్స్ చేశారు. నీతూ డేవిడ్(భారత్) 10 టెస్టులాడి 41 వికెట్లు, 92 వన్డేల్లో 141 వికెట్లు తీశారు. డివిలియర్స్(సౌతాఫ్రికా) 114 టెస్టుల్లో 8,765 రన్స్, 228 వన్డేల్లో 9,577 పరుగులు, 78 టీ20ల్లో 1,672 రన్స్ చేశారు.
Similar News
News September 13, 2025
వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: సత్యకుమార్

AP: చికిత్స విషయంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్లు, సిబ్బందిపై కొందరు దాడి చేయడాన్ని మంత్రి సత్యకుమార్ ఖండించారు. వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘స్టాఫ్ వ్యవహారశైలిలో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. వారిపై దాడులు చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. ఇది సరైంది కాదు’ అని Xలో పేర్కొన్నారు.
News September 13, 2025
షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్లైన్లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
News September 13, 2025
సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.