News October 22, 2025

వాడిన నూనె‌తో వంట.. నో చెప్పాల్సిందే!

image

చాలామంది ఇంట్లో పూరీలు, పకోడీలు వేయించాక అదే నూనెను వడకట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం చూస్తుంటాం. అయితే ఇలా వేయించిన నూనెను మళ్లీ పప్పు తాలింపు లేదా కూరలు వండేందుకు వాడటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి చేయడంతో నూనెలో హానికరమైన రసాయనాలు (ఫ్రీ రాడికల్స్) ఏర్పడతాయని, ఇది ఉపయోగిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. SHARE IT

Similar News

News October 24, 2025

ఈ రోజు రాత్రి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

News October 24, 2025

మల్లె సాగు – అనువైన రకాలు

image

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.

News October 24, 2025

APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 పోస్టులు

image

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్‌ లెవల్‌లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/