News April 18, 2024

సమ్మర్‌లో కూల్ టిప్స్..

image

➯ఆల్కహాల్, కెఫీన్, డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి చేసి హీట్‌ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
➯ఇంట్లో డోర్లు, విండోలకు గ్రాస్ కర్టెన్ లాంటివి వినియోగించాలి.
➯నీరు, వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి
➯వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. చన్నీటి స్నానం శరీర వేడిని తగ్గిస్తుంది
➯సహజమైన గాలి ప్రవాహం కోసం ఇంట్లో వ్యతిరేక దిశల్లో ఉన్న కిటికీలను తెరిచి ఉంచాలి.

Similar News

News November 18, 2024

DEC 21న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా DEC 21న GST కౌన్సిల్ 55వ సమావేశం జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాలు/UTల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST మినహాయింపుపై(ప్రస్తుతం 18%) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, నోట్‌బుక్స్‌పై GSTని 5 శాతానికి తగ్గించడంపై చర్చిస్తారు.

News November 18, 2024

రాహుల్.. మీ CMను నియంత్రించలేరా?: KTR

image

లగచర్ల బాధితులు 9నెలలుగా పోరాడుతున్నారని, పేద గిరిజనుల బాధలు రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? అని KTR ప్రశ్నించారు. మీ పార్టీ CMను నియంత్రించే పరిస్థితి లేదా అని నిలదీశారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. మణిపూర్ లాగే లగచర్లలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 300రోజులు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని ఢిల్లీలో విమర్శించారు.

News November 18, 2024

తాను చనిపోయినా.. నలుగురికి ప్రాణం పోసిన రెండేళ్ల బాలుడు

image

కెన్యాకు చెందిన రెండేళ్ల లుండా యుంబా చనిపోతూ భారత్‌లోని నలుగురికి ప్రాణం పోశారు. రెండో అంతస్తు నుంచి పడిపోవడంతో లుండా తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ అక్టోబర్ 26న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. దీంతో అతని అవయవాలు దానం చేసేందుకు లుండా తల్లి ముందుకొచ్చారు. ఇండియాలో పాంక్రియాస్ గ్రంథి దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండానే. చండీగఢ్‌లోని PGI ఆస్పత్రి వైద్యులు లుండాకు ఘన నివాళులర్పించారు.