News August 15, 2025
‘కూలీ’కి తొలిరోజు భారీ కలెక్షన్స్!

సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేశ్ కాంబోలో నిన్న రిలీజైన ‘కూలీ’ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు ₹140Cr(గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ Sacnik తెలిపింది. తమిళ్‌లో ₹28Crతో హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ బ్రేక్ చేసినట్లు పేర్కొంది. తెలుగులో ₹18Cr, కన్నడలో ₹15Cr, మలయాళంలో ₹10Cr, హిందీలో ₹8Cr వచ్చాయంది. ఓవరాల్‌గా INDలో ₹65Cr, ఓవర్సీస్‌లో ₹75Cr కలెక్ట్ చేసిందని తెలిపింది.
Similar News
News August 15, 2025
తీవ్ర విషాదం.. 60 మంది మృతి

J&K కిష్త్వార్‌లో ఫ్లాష్ <<17408968>>ఫ్లడ్స్<<>> తీవ్ర విషాదం నింపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మంది మరణించగా 100 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. బురదలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు కాపాడాయి. చసోటి గ్రామ సమీపంలో సుమారు 9,500 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న మచైల్ మాతా వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు వెళ్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
News August 15, 2025
జల జగడం.. హాట్ హాట్‌గా సీఎంల వ్యాఖ్యలు

నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల CMల వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. బనకచర్లపై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్టుతో <<17410795>>ఏ రాష్ట్రానికి<<>> నష్టం జరగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామని, గోదావరి-కృష్ణాలో వాటాలు దక్కాల్సిందేనని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వ్యూహాలు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ అనడంతో రెండు రాష్ట్రాల జల జగడం ఇప్పట్లో తేలుతుందా అనే చర్చ మొదలైంది.
News August 15, 2025
రాష్ట్రంలో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

AP: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో ఇల్లాలు. శ్రీకాకుళం(D) పాతపట్నంకు చెందిన నల్లి రాజు, మౌనికకు వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల ఆమెకు ఉదయ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. అతడి భోజనంలో నిద్రమాత్రలు కలిపి, ప్రియుడితో పాటు మరొకరితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడింది.