News August 12, 2025
రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘కూలీ’

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికా ప్రీ-సేల్స్‌లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తమిళ చిత్రంగా ‘కూలీ’ రికార్డులకెక్కింది. మన దగ్గర ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే, తమిళనాడుతో పోల్చితే హైదరాబాద్‌లో అధిక ధరలు ఉన్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News February 7, 2026
40 దాటిందా? ఇవి తినండి..

నలభై దాటిన తర్వాత మహిళలు ప్రీ మెనోపాజ్ స్థితికి వస్తారు. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. వీటిని సమతుల్యం చేయడానికి డైట్‌లో ఐరన్, ఫోలేట్, విటమిన్ B12 చేర్చుకోవాలంటున్నారు న్యూట్రిషనిస్టులు. వీటి కోసం బీట్‌రూట్, మాంసం, పాలకూర, బ్రోకలీ, నారింజ, గుడ్లు, పాలు, చేపలు తీసుకోవాలని చెబుతున్నారు. ✍️ మహిళల్లో 40ఏళ్ల తర్వాత వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News February 7, 2026
శివాభిషేకం: ఏ అభిషేకంతో ఏ ఫలితం?

☛ ఆవు పాలు: సర్వ సౌభాగ్యాలు ☛ ఆవు పెరుగు: ఆరోగ్యం, బలం ☛ ఆవు నెయ్యి: ఐశ్వర్యాభివృద్ధి ☛ పంచదార: దుఃఖనాశనం, ఆకర్షణ ☛ తేనె: తేజో వృద్ధి ☛ భస్మజలం: మహాపాప హరణం ☛ సుగంధోదకం: పుత్రలాభం ☛ పుష్పోదకం: భూలాభం ☛ బిల్వజలం: భోగభాగ్యాలు ☛ నువ్వుల నూనె: అపమృత్యు భయ హరణం ☛ రుద్రాక్షోదకం: మహా ఐశ్వర్యం ☛ సువర్ణజలం: దరిద్ర నాశనం ☛ అన్నాభిషేకం: సుఖ జీవనం ☛ ద్రాక్షరసం: సకల కార్యాభివృద్ధి.
News February 7, 2026
మహిళల్లో నలభై ఏళ్ల తర్వాత వచ్చే వ్యాధులివే..

నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధుల ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


