News August 16, 2025
2 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన ‘కూలీ’!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీవర్గాలు తెలిపాయి. తొలి రోజు కంటే రెండో రోజు కాస్త కలెక్షన్లు తగ్గాయని పేర్కొన్నాయి. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా ₹65 కోట్లు(గ్రాస్) కలెక్షన్లు రాగా ఇండియాలోనే ₹40.57 కోట్లు(నెట్) వచ్చినట్లు వెల్లడించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ₹220 కోట్లు (గ్రాస్) వసూలు చేశాయన్నాయి. కాగా దీనిపై మేకర్స్ అఫీషియల్‌గా స్పందించాల్సి ఉంది.
Similar News
News August 16, 2025
INDIA MAP: రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలిలా

కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్, రవాణా ఖర్చులు, డీలర్ కమీషన్‌తో పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల వివరాలు తెలిపే మ్యాప్ వైరలవుతోంది. ఇందులో అత్యధికంగా APలో ₹109.5, TGలో ₹107.46 ఉన్నాయి. అలాగే అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ₹82.46గా ఉంది. గతంలో BJP పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించడం వల్ల అక్కడి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.
News August 16, 2025
BIG ALERT.. రేపు అత్యంత భారీ వర్షాలు

TG: రేపు కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. సూర్యాపేట, సిద్దిపేట, PDPL, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, BHPL, జనగాం, ADBలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్లపై ఇబ్బందులు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తితే 040-3517-4352 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది.
News August 16, 2025
‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఆందోళన.. మీ కామెంట్?

TG: <<17419574>>మార్వాడీలు<<>> వ్యాపారం చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు వేగంగా విస్తరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అని నినదిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. క్వాలిటీతో పాటు మంచి సర్వీస్ అందిస్తే ఎవరికైనా లాభాలు వస్తాయంటున్నారు. దీనిపై మీ కామెంట్?