News August 14, 2025

‘కూలీ’ సినిమా ఆల్ టైమ్ రికార్డు

image

ఓవర్సీస్ వసూళ్లలో ‘కూలీ’ <<17400697>>సినిమా<<>> ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు ($3,042,756= ₹24.26Cr) సాధించిన తమిళ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మీరు ఈ సినిమా చూశారా? ఎలా అనిపించింది?

Similar News

News August 15, 2025

శుభ సమయం (15-08-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ సప్తమి రా.1.22 వరకు
✒ నక్షత్రం: అశ్విని ఉ.10.05 వరకు
✒ శుభ సమయం: ఉ.10.14-10.44, సా.5.14-5.26
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: ఉ.3.00-ఉ.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.00-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: ఉ.5.57-7.27, రా.7.01-8.31
✒ అమృత ఘడియలు: సా.4.09-5.38

News August 15, 2025

TODAY HEADLINES

image

* పులివెందుల, ఒంటిమిట్ట ZPTCలు TDP కైవసం
* ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN
* దొంగ ఓట్లతో గెలవడమూ ఓ గెలుపేనా: అవినాశ్
* CS పదవీకాలం పొడిగింపు కోసం CM రేవంత్ రిక్వెస్ట్!
* SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్
* 3 దశాబ్దాల తర్వాత నచ్చిన వారికి ఓటేశారు: పవన్
* ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది: రాష్ట్రపతి
* ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్

News August 15, 2025

శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.