News September 28, 2024
లంచం అడిగిన పోలీసులు.. పాముకాటుకు చికిత్స లేటవడంతో మృతి!

పొలంలో పాము కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతో ఓ వ్యక్తి మరణించాడు. బిహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రామ్ లఖన్ ప్రసాద్ అనే వ్యక్తిని పాము కాటేయడంతో ఆస్పత్రికి పరిగెత్తాడు. మద్యం తాగి పరిగెడుతున్నాడని అనుమానించి పోలీసులు అడ్డుకున్నారు. పాము కాటు గురించి చెప్పినా నమ్మలేదు. వదిలేయాలంటే రూ.2వేలు లంచం అడగ్గా అతని సోదరుడు రూ.700 ఇచ్చి తీసుకెళ్లాడు. లేట్ అవడంతో రామ్ చనిపోయాడు.
Similar News
News December 9, 2025
పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

TG: జీపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించగా అందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఇతరుల సంఖ్య 500గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3.50 లక్షలు అధికం. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో(11, 14, 17) పోలింగ్ కోసం 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది.
News December 9, 2025
ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజించాలి?

గడపను ద్వార లక్ష్మిగా పూజిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. ఇది దేవతలను ఆహ్వానించే ప్రదేశం కాబట్టి వారి అనుగ్రహం లభిస్తుంది. సిరిసంపదలతో పాటు, పెళ్లికాని వారికి మంచి భాగస్వామి దొరుకుతారు. ఇంట్లో ఉన్న కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరాలంటే యజమాని ఈ ద్వారలక్ష్మి పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు. గడప పూజ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు.
News December 9, 2025
ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.


