News December 19, 2024

నాంపల్లి కోర్టుకు కేటీఆర్ FIR కాపీ

image

TG: ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన FIR కాపీని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సమర్పించారు. ఆయనపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కాగా కేటీఆర్‌పై ఏసీబీ నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>ప్రసార భారతి<<>> 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం గల వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News September 16, 2025

రేబిస్‌తో చిన్నారి మృతి

image

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.

News September 16, 2025

షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు: BCCI

image

పాక్ క్రికెటర్లకు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై <<17723523>>వివాదం<<>> తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై BCCI సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ‘ప్రత్యర్థులతో షేక్ హ్యాండ్‌కు సంబంధించి రూల్ బుక్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్ లేదు. అది ఒక గుడ్‌విల్ జెశ్చర్ మాత్రమే. చట్టం కాదు. అలాంటి రూల్ లేనప్పుడు సత్సంబంధాలు లేని ప్రత్యర్థికి టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.